- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన సెక్స్ వీడియోలపై దేవెగౌడ మనవడు ప్రజ్వల్ తొలి స్పందన
దిశ, నేషనల్ బ్యూరో : తన అశ్లీల వీడియోల వ్యవహారంపై మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, సస్పెండ్ అయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో : తన అశ్లీల వీడియోల వ్యవహారంపై మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, సస్పెండ్ అయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో లీకైన వెంటనే బెంగళూరు నుంచి జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్.. ఈ అంశంపై గురువారం రోజు నోరు విప్పారు. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. తనపై ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజ్వల్ మండిపడ్డారు.
ವಿಚಾರಣೆಗೆ ಹಾಜರಾಗಲು ನಾನು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇಲ್ಲದ ಕಾರಣ, ನಾನು ನನ್ನ ವಕೀಲರ ಮೂಲಕ C.I.D ಬೆಂಗಳೂರಿಗೆ ಮನವಿ ಮಾಡಿದ್ದೇನೆ.
— Prajwal Revanna (@iPrajwalRevanna) May 1, 2024
ಸತ್ಯ ಆದಷ್ಟು ಬೇಗ ಹೊರಬರಲಿದೆ.
As I am not in Bangalore to attend the enquiry, I have communicated to C.I.D Bangalore through my Advocate. Truth will prevail soon. pic.twitter.com/lyU7YUoJem
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యేందుకు తాను ప్రస్తుతం బెంగళూరులో లేనన్నారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ప్రజ్వల్ ఓ పోస్ట్ చేశారు. ఈ అంశంపై తన న్యాయవాది ద్వారా ఇప్పటికే సీఐడీని సంప్రదించినట్లు చెప్పారు. ‘‘నేను విచారణకు హాజరు కావడానికి బెంగళూరులో అందుబాటులో లేను. దీనిపై నా న్యాయవాది ద్వారా బెంగుళూరులోని సీఐడీ అధికారులకు సమాచారాన్ని అందజేశాను. త్వరలో నిజం గెలుస్తుంది’’ అని ప్రజ్వల్ రేవణ్ణ పేర్కొన్నారు.






