మోడీ పేరు చెప్పాలని ఒత్తిడి చేసారు : ప్రజ్ఞా ఠాకూర్

by Muthe.Rajitha |

ఇటీవల మాలెగావ్ పేలుళ్ల కేసు(Malegoan Blast Case)లో నిర్దోషిగా విడుదలైన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్(Pragna Thakur) సంచలన ఆరోపణలు చేసారు.

మోడీ పేరు చెప్పాలని ఒత్తిడి చేసారు : ప్రజ్ఞా ఠాకూర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మాలెగావ్ పేలుళ్ల కేసు(Malegoan Blast Case)లో నిర్దోషిగా విడుదలైన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్(Pragna Thakur) సంచలన ఆరోపణలు చేసారు. విచారణ సమయంలో అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈకేసులో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లను బలవంతంగా ఇరికించాలని చూశారని అన్నారు. విచారణలో వారి పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ప్రజ్ఞా తెలిపారు. అయితే తాను వాటికి ఒప్పుకోలేదని అన్నారు. మహారాష్ట్రలోని మాలెగావ్ లో 2008 సెప్టెంబర్ లో ఓ మసీదు వద్ద స్కూటర్ బాంబు పేలి ఆరుగురు మరణించగా... 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈకేసులో ప్రజ్ఞా ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్ కార్, సుధాకర్ చతుర్వేది, సుధాకార్ ద్వివేది, సమీర్ కులకర్ణిని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేసారు. అయితే ఈ కేసులో వారంతా నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్ఐఏ ఇటీవల కేసు కొట్టివేస్తూ.. వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.

Next Story