- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE: సీబీఎస్ఈ చెల్లింపు సమస్యలపై కేంద్రం కీలక చర్యలు
విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పేమెంట్ గేట్‌వేను మరింత వేగవంతంగా, సురక్షితంగా, పారదర్శకంగా మార్చాలన్నారు

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఎస్‌ఈ పరీక్షల అనంతరం సేవల చెల్లింపుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పేమెంట్ గేట్‌వేను మరింత వేగవంతంగా, సురక్షితంగా, పారదర్శకంగా మార్చాలన్నారు. ముఖ్యంగా 'ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్', 'రియల్ టైమ్ మానిటరింగ్' వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరారు. కాగా, ఇటీవల సీబీఎస్‌ఈ ఫలితాల అనంతరం రీవాల్యూయేషన్, జవాబు పత్రాల ఫోటోకాపీల కోసం విద్యార్థులు ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు లావాదేవీలు విఫలమవ్వడం, సాంకేతిక లోపాలు తలెత్తడంపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ పేమెంట్ గేట్‌వే వ్యవస్థను అత్యవసరంగా పునర్వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. మే 24న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన చర్చల తర్వాత, ఈ వ్యవస్థను ఆధునీకరించే ప్రక్రియ మరింత వేగవంతం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు, సీబీఎస్‌ఈతో సమన్వయం చేసుకుంటూ కొత్త టెక్నికల్ అప్‌డేట్‌లను అమలు చేస్తామని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు హామీ ఇచ్చాయి.






