- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమానాల్లో పవర్ బ్యాంకులు నిషేధం!
by Muthe.Rajitha |
దేశీయ విమానాల్లో(Domestic Flights) ఇకపై పవర్ బ్యాంకులను(Power Banks) నిషేధించనుంది కేంద్ర పౌర విమానయాన శాఖ.

X
దిశ, వెబ్ డెస్క్ : దేశీయ విమానాల్లో(Domestic Flights) ఇకపై పవర్ బ్యాంకులను(Power Banks) నిషేధించనుంది కేంద్ర పౌర విమానయాన శాఖ. అయితే ఇటీవల ఇండిగో డొమెస్టిక్ ఫ్లైట్ లో ఓ ప్యాసింజర్ పవర్ బ్యాంకు నుంచి మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తం అయిన విమాన సిబ్బంది మంటలను ఆర్పివేయగా.. పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ క్రమంలో దేశీయ విమాన సర్వీసుల్లో పవర్ బ్యాంకులను నిషేధించే అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. లేదా తక్కువ పవర్ సామర్ఘ్యం ఉన్నవాటిని మాత్రమే అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.
దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. మరోవైపు అనేక అంతర్జాతీయ విమానాల్లో పవర్ బ్యాంకుల వాడకంపై నిషేధం అమల్లో ఉంది. దీని ప్రకారం డొమెస్టిక్ ఫ్లైట్స్ లో కూడా నిషేధం విధించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు సమాచారం.
Next Story






