హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత!

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-19 17:14:23  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మవలసలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మాతో పాటు, అతడి భార్య మడకామ్ రాజే, దేవే, లక్మల్, మల్లా, కమ్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత!
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జియమ్మవలసలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మా (Madvi Hidma)తో పాటు, అతడి భార్య మడకామ్ రాజే (Madakam Raje), దేవే, లక్మల్, మల్లా, కమ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆరుగురి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భద్రతా బలగాల బందోబస్తు నడుమ 8 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అక్కడికి హిడ్మా తల్లితో పాటు సోదరుడు, పువ్వర్తి గ్రామ సర్పంచ్ వెళ్లారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలోనే రంపచోవరం ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి.

Next Story