- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 'చిన్ను పాపు' ఆత్మహత్య!
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, 24 ఏళ్ల రేష్మ (చిన్ను పాపు) సోమవారం కాసరగోడ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, 24 ఏళ్ల రేష్మ (చిన్ను పాపు) సోమవారం కాసరగోడ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామీణ జీవనశైలి, స్థానిక వంటకాలు, తులు భాషపై వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాసరగోడ్ పట్టణం సమీపంలోని ఉలియత్తడ్కలో ఉన్న తన అద్దె ఇంట్లో రేష్మ సోమవారం మధ్యాహ్నం ఉరివేసుకుని కనిపించారు. ఇది గమనించిన పక్కింటి వారు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రేష్మ స్వస్థలం దెలంపాడి పంచాయతీ పరిధిలోని అడూరు గ్రామం.
వ్యక్తిగత కారణాలేనా?
రేష్మకు గతంలో ప్రేమ వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా ఒక నెల క్రితమే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి నాలుగు ఏళ్ల కొడుకు ఉండగా.. ప్రస్తుతం రేష్మ తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నాడు. కుటుంబ సమస్యలే ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో చిన్ను పాపు ప్రస్థానం..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2,06,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చిన్ను పాపు పేరుతో గ్రామీణ వాతావరణం, ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లు, తులు సంస్కృతిపై ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. మరణానికి ఆరు రోజుల క్రితం ఆకుకూరల ప్రాముఖ్యతపై ఆమె చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ వేలాది మందికి వినోదాన్ని పంచిన రేష్మ మరణాన్ని ఆమె తోటి క్రియేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు 'అనుమానాస్పద మృతి'గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.






