సింగపూర్‌‌లో ప్రముఖ సింగర్ మృతి.. అస్సాంకు తరలించేందుకు ఏర్పాట్లు

by Malleboina Mahesh |

అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్‌ నిన్న సింగపూర్‌లో దురదృష్టవశాత్తు మరణించాడు.

సింగపూర్‌‌లో ప్రముఖ సింగర్ మృతి.. అస్సాంకు తరలించేందుకు ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్‌ (Zubin Garg) నిన్న సింగపూర్‌లో దురదృష్టవశాత్తు మరణించాడు. ఓ ఈవెంట్ లో పాల్గోనేందుకు సింగపూర్ (Singapore) వెళ్లియన ఆయన యాట్‌ ప్రయాణం (Yat trip)లో సముద్రంలో ఈతకు దిగినప్పుడు లైఫ్‌ జాకెట్‌ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తొలుత స్కూబా డైవింగ్ చేస్తూ మృతి చెందారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అది నిజం కాదని, ఆయన సాధారణంగా ఈత కొట్టేందుకు దిగి.. లైఫ్ జాకెట్ (Life jacket) లేకపోవడంతో ఈతలో నీటిలో మునిగి చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం అతని మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం (Singapore Govt) తో మాట్లాడింది. ఇప్పటికే పోస్ట్‌మార్టమ్‌ పూర్తి కాగా.. ఆయన భౌతికకాయాన్ని అస్సాం (Assam) తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌహతిలోని సరాసజాయి స్టేడియంలో అభిమానులు, ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించే అవకాశం కల్పించనున్నట్లు అస్సాం ప్రభుత్వం (Government of Assam) తెలిపింది. ఈ సంఘటనతో అసోం ప్రజలు, భారతీయ సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Next Story