Pope: కొత్త పోప్‌గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్.. అమెరికా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డ్

by B.Srinivas |

అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ కొత్త పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు.

Pope: కొత్త పోప్‌గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్.. అమెరికా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ (Robert Francis Prevost) కొత్త పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు. నూతన పోప్‌ను ఎన్నుకునేందుకు అత్యంత రహస్యంగా సిస్టిన్ చాపెల్‌లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్‌ను నియమించారు. సంప్రదాయం ప్రకారం సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడటంతో, కార్డినల్స్ భేటీ అయిన రెండో రోజే నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్టు ప్రకటించారు. దీంతో అమెరికా నుండి పోప్ అయిన మొదటి వ్యక్తిగా రాబర్ట్ రికార్డు సృష్టించారు. 133 మంది కార్డినల్స్ లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆయన పోప్ గా ఎన్నికైనట్టు వాటికన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు మే 7న జరిగిన మొదటి రోజున ఎవరూ పోప్‌గా ఎన్నిక కాలేదు. కొత్తగా ఎన్నికైన పోప్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభినందనలు తెలిపారు. కొత్త పోప్ యూఎస్ వ్యక్తి కావడం తమకు ఎంతో గౌరవంగా ఉందన్నారు.

రాబర్ట్ నేపథ్యం?

పోప్ లియో 1955 సెప్టెంబర్ 14న అమెరికాలోని చికాగోలో జన్మించారు. 2023 నుండి బిషప్‌ల కోసం డికాస్టరీకి ప్రిఫెక్ట్‌గా, లాటిన్ అమెరికా కోసం పోంటిఫికల్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో కార్డినల్‌గా, 2025లో కార్డినల్-బిషప్‌గా పదోన్నతి పొందాడు. ఆయన పోప్ ఫ్రాన్సిస్ కు సన్నిహితుడిగా పరిగణించబడ్డారు. ఈ క్రమంలోనే నూతన పోప్ గా ఎన్నికయ్యారు.

Next Story