- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinagar: కశ్మీర్‌ను వీడుతున్న టూరిస్టులు.. 6 గంటల్లోనే 3,337 మంది యూటర్న్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని పహల్గామ్ (Pahalgaam) లో జరిగిన ఉగ్రదాడి తర్వాత కశ్మీర్‌కు వెళ్లిన పర్యాటకుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో వారంతా కశ్మీర్‌ను వీడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కేవలం ఆరు గంటల వ్యవధిలోనే శ్రీనగర్ (Srinagar) ఎయిర్ పోర్టు నుంచి 3,337 మంది ప్రయాణికులు వెనక్కి వెళ్లినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram mohan nayudu) తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 20 విమానాల్లో వీరంతా వెళ్లినట్టు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ నుంచి పర్యాటకులు వెనక్కి వస్తున్నందున శ్రీనగర్ ఎయిర్ పోర్టులో చార్జీల పెంపును నియంత్రించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
టెర్రరిస్ట్ అటాక్ అనంతరం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూసుకోవడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఉగ్ర దాడి తర్వాత విమాన చార్జీలు భారీగా పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రామ్ మోహన్ నాయుడు ఈ ఆర్డర్స్ జారీ చేశారు. కశ్మీర్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులను తిరిగి తీసుకురావడానికి అదనపు విమానాలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చార్జీలను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కాగా, ఉగ్రదాడి వల్ల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు భావిస్తున్నారు.






