Pope: సెయింట్ పీటర్స్ బసిలికాకు పోప్ ఫ్రాన్సిస్ భౌతికదేహం.. ప్రజల సందర్శనకు ఏర్పాట్లు

by B.Srinivas |

కాథలిక్ క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ మృత దేహాన్ని వాటికన్ హోటల్ నుంచి సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు.

Pope: సెయింట్ పీటర్స్ బసిలికాకు పోప్ ఫ్రాన్సిస్ భౌతికదేహం.. ప్రజల సందర్శనకు ఏర్పాట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాథలిక్ క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ (Popr Francis) మృత దేహాన్ని వాటికన్ హోటల్ (Vatican hotel) నుంచి సెయింట్ పీటర్స్ బసిలికా (saint peters basilica)కు తరలించారు. మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. భారీ ఊరేగింపుతో బసిలికాకు తీసుకెళ్లగా చివరి సారిగా పోప్‌ను చూసేందుకు సందర్శకులు తరలివచ్చారు. మొదటి పోప్ అయిన సెయింట్ పీటర్ ప్రధాన సమాధి ముందున్న పవిత్ర స్థలం కన్ఫెసియో బలిపీఠం వద్ద ఫ్రాన్సిస్ శవపేటికను ఉంచారు.

దీంతో పోప్‌కు తుది నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఏప్రిల్ 26న జరుగనున్నట్టు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి వివిధ ప్రపంచ నేతలు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Next Story