- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pope Francis : భారత్‌లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటనపై కేంద్రం కీలక ప్రకటన
![Pope Francis : భారత్‌లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటనపై కేంద్రం కీలక ప్రకటన Pope Francis : భారత్‌లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటనపై కేంద్రం కీలక ప్రకటన](https://www.dishadaily.com/h-upload/2024/12/07/398616-pope-franciss-visit-to-india-jubilee-year-2025.webp)
దిశ, నేషనల్ బ్యూరో : క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) 2025 సంవత్సరంలో భారత్(India)లో పర్యటించే అవకాశాలు దాదాపు లేవు. ఈవిషయాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి జార్జ్ కురియన్(George Kurian) వెల్లడించారు. ‘‘వచ్చే ఏడాది (2025)ని జూబ్లీ ఇయర్‌గా క్యాథలిక్ చర్చి ప్రకటించింది. ఈసందర్భంగా నిర్వహించే ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పోప్ ఫ్రాన్సిస్ బిజీగా ఉంటారు. అందుకే 2025లో భారత పర్యటనకు ఆయన సమయం కేటాయించే అవకాశాలు తక్కువగా ఉంటాయి’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
జూబ్లీ ఇయర్ ముగిశాకే భారత పర్యటనకు పోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే పర్యటన షెడ్యూల్‌పై పోప్ కార్యాలయమే తుది ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కలిశారు. భారత పర్యటనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.