- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pope: శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రీన్ విచ్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రీన్ విచ్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. కాగా.. అంతిమసంస్కారాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై మంగళవారం కార్డినల్స్ మీటింగ్ జరిగింది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినల్స్ అందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 9 రోజులపాటు సంతాపదినాలు పాటిస్తున్నారు. వీటిని నవెండియలెస్ అంటారు. సాధారణంగా పోప్ అంత్యక్రియలు, ఖననం ప్రక్రియ మృతి చెందిన నాటినుంచి నాలుగు నుంచి ఆరో రోజు మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం అంత్యక్రియల రోజుగా నిర్ణయించారు. పోప్ భౌతికకాయం ఫొటోలను కూడా తొలిసారి వాటికన్ విడుదల చేసింది. సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ భౌతిక గాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో కాకుండా రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఖననం చేయనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకే ఇలా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అంత్యక్రియలకు ట్రంప్
పోప్ ఫ్రాన్సిస్ అంతిమ సంస్కారాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా కూడా అక్కడికి వెళ్లనున్నారు. శ్వేత సౌధంలో సంప్రదాయ ఈస్టర్ ఎగ్ రోల్ వేడుక ముగియగానే.. పోప్ మృతి వార్తను అధ్యక్షుడికి చేరవేశారు. కాగా.. లస సమస్యలపై పోప్ ఫ్రాన్సిస్‌తో ట్రంప్ పదేపదే ఘర్షణ పడటం గమనార్హం. మరోవైపు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే కూడా పోప్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.






