Pope Francis: ఆస్పత్రి నుంచి పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్.. ఐదు వారాల తర్వాత బయటకు

by B.Srinivas |

తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ డిశ్చార్జ్ అయ్యారు.

Pope Francis: ఆస్పత్రి నుంచి పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జ్.. ఐదు వారాల తర్వాత బయటకు
X

దిశ, నేషనల్ బ్యూరో: తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ (Pope francis) ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. న్యూమోనియా ఆపరేషన్ నిమిత్తం గత నెల 14న పోప్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వైద్యం పొందుతుండగా తాజాగా రిలీజ్ అయ్యారు. దీంతో ఐదు వారాల తర్వాత ప్రజలకు బహిరంగంగా కనిపించారు. పోప్ రిలీజ్ విషయం తెలిసిన వెంటనే తన మద్దతు దారులు భారీగా హాస్పటల్‌కు చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి బాల్కనీలోకి రాగానే తన ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ అభివాదం చేశారు. వారిని చూసి చిరునవ్వుతో చేయి ఊపాడు. అనంతరం భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య వాటికన్ సిటీలోని తన ఇంటికి చేరుకున్నారు. పోప్‌కు వైద్యులు రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఆయనకు నిరంతరం ఆక్సిజన్ అందుబాటులో ఉండటంతో పాటు 24 గంటల వైద్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది. అంతకుముందు పోప్ ఆస్పత్రిలో ఉండగా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రజలు భారీగా ప్రార్థనలు చేశారు.

Next Story