- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pope: త్వరలోనే కొత్త పోప్ ఎన్నిక.. సిస్టిన్ చాపెల్‌లోకి వెళ్లనున్న కార్డినల్స్
క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope francis) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త పోప్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. కొత్త పోప్ ఎన్నిక కోసం సిస్టీన్ చాపెల్‌లో 133 మంది కార్డినల్స్ బుధవారం సిస్టిన్ చాపెల్‌లోకి వెళ్లనున్నారు. సమావేశం పూర్తి రహస్యంగా జరగనుండగా, కొన్ని నెలల పాటు ఇది జరిగే అవకాశం ఉంది. వాటికన్‌లోని శాంటా మార్టా గెస్ట్‌హౌస్‌లో వారంతా బస చేయనున్నారు. ఐదు ఖండాల్లోని 70 దేశాల ప్రతినిధులు ఈ ప్రక్రియలో భాగం కానుండగా ఈ సమావేశం ఇప్పటివరకు జరిగిన వాటిలో అతిపెద్దది కానుంది. ఫ్రాన్సిస్, అతని పూర్వీకుడు బెనెడిక్ట్ XVI ఇద్దరూ రెండు రోజుల్లోనే పోప్ గా ఎన్నికవ్వగా చర్చి చరిత్రలో అతి పొడవైన పాపల్ ఎన్నిక 1268 నుంచి 1271 వరకు 1,006 రోజులు కొనసాగింది.
ఇప్పటివరకు జరిగిన చర్చలు వాటికన్ ఆర్థిక వ్యవహారాల నుంచి చర్చి ఐక్యతన తదుపరి పోప్ ప్రొఫైల్ వరకు ప్రతిదానినీ పరిగణనలోకి తీసుకున్నాయి. కాగా, పోప్ ఎన్నిక ప్రక్రియ ముగిసే వరక కార్డినల్స్ రహస్యంగా ఉండనున్నారు. సమావేశంలో ఏం జరుగుతుందో బయటకు వెల్లడిస్తే బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. తుది నిర్ణయం తీసుకునే వరక వారంతా బయటకు రాకుండా ఉంటారు. బుధవారం నుంచి వాటికన్ నగరంలో ఫోన్ సిగ్నల్ కట్ చేయనున్నారు.






