- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Puja Khedkar : వైకల్యం సర్టిఫికేట్ నకిలీదే! హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్.. యూపీఎస్సీ(UPSC)కి సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదేనని(Fake) పోలీసులు తేల్చారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్.. (Puja Khedkar) యూపీఎస్సీ(UPSC)కి సమర్పించిన సర్టిఫికెట్ నకిలీదేనని(Fake) పోలీసులు తేల్చారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. పూజా కేడ్కర్ సర్టిఫికేట్(Certificate) లో తన పేరును మార్చుకొని, 3 వేర్వేరు పేర్లను ఉపయోగించి ఇప్పటివరకూ 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లు పోలీసులు తెలిపారు. కేడ్కర్ తన శారీరక, మానసిక వైకల్యాల(Disabilities) గురించి అబద్ధాలు చెప్పారని, అలాగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఓబీసీ సర్టిఫికేట్(OBC Certificate)ను కూడా ఫోర్జరీ(Forgery) చేశారనే ఆరోపణలు ఉన్నందువల్ల, ఆమె సర్వీసు(Service) ను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో కూడా పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది.
పూజా కేడ్కర్.. 2018-2021 ల మధ్య, 2022-2023 లో యూపీఎస్సీ పరీక్షల కొరకు అహ్మద్ నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు పొందినట్లుగా తెలుస్తోంది. కేడ్కర్ UPSC పరీక్షలో అదనపు ప్రయత్నాలను పొందేందుకు తన పేరును మార్చడమే కాకుండా, ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, పూజా కేడ్కర్.. తప్పుడు సర్టిఫికేట్లతో మోసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. కాగా యూపీఎస్సీ జులై 31 న పూజా కేడ్కర్ తాత్కాలిక అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసి, భవిష్యత్తులో ఎటువంటి పరీక్షలు రాయకుండా నిషేధించింది.






