ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 2,615 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా అధికారంలోకి రావాలంటే కనీసం 113 సీట్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్‌ కేంద్రాల్లో 5.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Next Story