ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్: పుదుచ్చేరిలో భారీ పోలింగ్

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 9, 2026) సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతంగా ముగిసింది.

ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్: పుదుచ్చేరిలో భారీ పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఏప్రిల్ 9, 2026) సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి ఓటర్లు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. ఇక్కడ రికార్డు స్థాయిలో 89.80 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ 84.42 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో మధ్యస్థంగా 75.01 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మే 4న ఫలితాలు..

ఈ మూడు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వచ్చే నెల మే 4 (సోమవారం)న జరగనుంది. అదే రోజున అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏ పార్టీ జెండా ఎగురనుందో స్పష్టం కానుంది. పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో గెలుపుపై అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Next Story