పోలింగ్ బూత్స్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన 'వోట్ చోరీ' ఆరోపణలు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

పోలింగ్ బూత్స్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన 'వోట్ చోరీ' ఆరోపణలు దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ఆరోపణలపై నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చింది. పోలింగ్ బూత్స్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలింగ్ బూత్ లో ఉన్న మహిళల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు చేపట్టలేమని తెలిపారు. అలాగే రాహుల్ ఆరోపణలపై అఫిడవిట్ సమ్పరించాలని, లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. అయితే ఈసీ వ్యాఖ్యలపై నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.

మహిళలు ఉంటారని సీసీ ఫుటేజీ ఇవ్వమని ఇప్పుడు చెబుతున్నారు, అసలు సీసీ కెమెరాలు పెట్టేముందు వారి పర్మిషన్ తీసుకున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలింగ్ బూత్స్ అనేవి ఓట్ వేసేవి మాత్రమేనని, అవేమి డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదని ఎద్దేవా చేసారు. ఈసీ చెప్పే సాకులపై దేశంలో ఎవరికీ ఆసక్తి లేదని, ఎన్నికల విధానంపై పూర్తి పారదర్శకత కావాల్సిందేనని ప్రకాష్ రాజ్ స్పష్టం చేసారు. రాహుల్ ఆరోపణలను సపోర్ట్ చేస్తూ దేశంలోని అనేక పార్టీలు, మేధావులు పోలింగ్ సీసీ టీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story