- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. కూటముల మధ్య హోరాహోరీ పోరు!
అసోం, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్చ ప్రారంభమైంది. మొత్తం 296 స్థానాల్లో 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అసోం, కేరళ, పుదుచ్చేరిలలో సరిగ్గా ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమయ్యాయి. మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 5.3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు అసోం, కేరళ, పుదుచ్చేరి ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కోరారు. డ్రోన్ల నిఘా, వెబ్‌కాస్టింగ్, భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. పుదుచ్చేరిలో అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలతో పాటు మే 4న విడుదలవుతాయి.
రాష్ట్రాల వారీగా పోటీ ఇలా..
అసోంలో బీజేపీ నేతృత్వంలోని NDA వరుసగా మూడోసారి విజయం సాధించాలని చూస్తుండగా, గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ 126 సీట్లకు గానూ 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కేరళంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని LDF ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి UDF ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ (NDA) కూడా ఇక్కడ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. పుదుచ్చేరిలో NDA, కాంగ్రెస్-DMK కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ పోటీలో ఉండటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అసోంలో నకిలీ పత్రాల చుట్టూ బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, ఆమె వాటిని ఖండించారు.






