- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యమునా నీటి నాణ్యత రిపోర్ట్స్ సమర్పించండి : ఈసీఐ
ల్లీ సీఎం ఆతిషి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌లు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కావాలనే యమునా నది నీటిని కలుషితం చేస్తోందని, తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని ఆ లేఖలో ఆరోపించారు.

- నీటిలో అమ్మోనియం శాతం ఎక్కువగా ఉందన్న ఆప్
- హర్యానా ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
- మంగళవారం మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలన్న ఈసీఐ
దిశ, నేషనల్ బ్యూరో:
యమునా నది నీటిలో అమ్మోనియం శాతం ఎక్కువగా ఉందని, ఇదే నీటిని ఢిల్లీకి హర్యానా సరఫరా చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆప్ సోమవారం ఫిర్యాదు చేసింది. హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని కలుషితం చేస్తోందని, దీంతో ఢిల్లీకి నీటి సరఫరా చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆప్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆప్ తరపున ఢిల్లీ సీఎం ఆతిషి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌లు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కావాలనే యమునా నది నీటిని కలుషితం చేస్తోందని, తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. ఇప్పటికే ఈ అంశంలో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్యానా ప్రభుత్వం యమునా నీటిలో విషం కలుపుతోందని అన్నారు. ప్రజలకు నీళ్లు దొరక్కుండా చేయడం కంటే పెద్ద పాపమేమీ లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ తమ డర్టీ పాలిటిక్స్‌ను ఢిల్లీ ప్రజలపై చూపిస్తోందని, వారు దాహంతో అల్లాడిపోయేలా చేస్తోందని కేజ్రివాల్ అన్నారు. హర్యానాలో నీరు కలుషితం కావడంతో ఢిల్లీలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయడం కష్టమవుతోందని కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ ప్రజలను సామూహికంగా హత్య చేయాలని బీజేపీ చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మేము ఎన్నటికీ సాధ్యం కానివ్వమని కేజ్రివాల్ తెలిపారు.
ఢిల్లీలోని 30 శాతం మంది ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. ఇందుకు యమునా నీళ్లలో అత్యధిక స్థాయిలో అమ్మోనియం ఉండటమే కారణమని సీఎం ఆతిషి పేర్కొన్నారు. కాగా, అమ్మోనియంతో కూడిన నీటిని ఢిల్లీలోని వజీరాబాద్, చంద్రవాల్, ఓక్లా ట్రీట్మెంట్ ప్లాంట్లు శుద్ది చేయలేక షట్ డౌన్ అయ్యాయని ఆమె తెలిపారు. కాగా, ఆప్ నాయకుల వ్యాఖ్యలను హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఖండించారు. ఆప్ ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. ఆప్ ఆరోపణలపై స్పందించిన ఈసీఐ.. హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల లోగా యమునా నీటి నాణ్యతకు సంబంధించిన రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.






