బెంగాల్‌లో భగ్గుమన్న రాజకీయాలు..! టీఎంసీ కార్యాలయానికి నిప్పు

by Ramesh Naini |   (  Updated:2026-05-04 11:01:50  IST  )

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కన్పిస్తోంది.

బెంగాల్‌లో భగ్గుమన్న రాజకీయాలు..! టీఎంసీ కార్యాలయానికి నిప్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కన్పిస్తోంది. అసన్‌సోల్ పరిధిలోని జమురియాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దాడులకు దారి తీశాయి. జమురియాలోని టీఎంసీ ఆఫీస్‌కు కొందరు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు, సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఫోటోలు బయట పడేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు కారకులు ఎవరు, ఆస్తి నష్టం ఎంత తదితర వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

దీదీకి గట్టి షాక్.. కమలనాథులదే విజయం!

మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఏకంగా టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో ఎదురులేకుండా పాలిస్తున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. గత రెండు దఫాల్లో సాధ్యంకాని విజయాన్ని ఈసారి కమలనాథులు కైవసం చేసుకున్నారు. ఈ సంచలన రాజకీయ పరిణామాల క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story