Flash News: భారత్ మాతాకీ జై.. ఆపరేషన్ సిందూర్ పై ప్రముఖుల రియాక్షన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-07 05:19:17  IST  )

ఏపీ సీఎం సహా ప్రముఖులు స్పందించారు. భారత్ మాతాకీ జై అంటూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) "న్యాయం జరుగుతుంది.. ఆపరేషన్ సింధూర్" అని ఇండియన్ ఆర్మీ చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ జైహింద్ అని పేర్కొన్నారు.

Flash News: భారత్ మాతాకీ జై.. ఆపరేషన్ సిందూర్ పై ప్రముఖుల రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ పై జరిగిన ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 30 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. బహవల్ పూర్ లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్, సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ - రాజౌరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్, జమ్మూకశ్మీర్ లో తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్, బర్నాలా క్యాంప్, సాంబా - కతువా ఎదురుగా ఉన్న సర్జల్ క్యాంప్, సియాల్ కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్.. మొత్తం పాక్, POKల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై మిస్సైళ్లతో దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. 4 జైషే స్థావరాలు, 3 లష్కరే స్థావరాలను ధ్వంసం చేసింది.

ఆపరేషన్ సిందూర్ పై ఏపీ సీఎం సహా ప్రముఖులు స్పందించారు. భారత్ మాతాకీ జై అంటూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) "న్యాయం జరుగుతుంది.. ఆపరేషన్ సిందూర్" అని ఇండియన్ ఆర్మీ చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ జైహింద్ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా భారత్ మాతాకీ జై (Bharat Mata ki Jai) అని, హరహర మహాదేవ్ అంటూ ట్వీట్ చేశారు. కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay).. ఆపరేషన్ సిందూర్ పై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి చెప్పినట్టుగానే ఉగ్రవాదుల్ని అంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని X వేదికగా తెలిపారు. మోదీ పాలనను భారత్ ఎప్పటికీ మరచిపోదన్నారు. మన దళాల భద్రత, విజయాన్ని కోరుకుంటున్నానని సద్గురు ట్వీట్ చేశారు.

పహల్గామ్ వంటి ఉగ్రదాడి మళ్లీ చేయకుండా పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పారని, పాకిస్థాన్ ఉగ్రవాద సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని పేర్కొని, జైహింద్ అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) Xలో పోస్ట్ చేశారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నామని ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక భారత సైన్యానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్‌’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

Next Story