- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో పొలిటికల్ హీట్.. విజయ్ రాజకీయాలపై శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు!
అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ అధికార డీఎంకే ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ (Sarath Kumar) అధికార డీఎంకే ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశంలో జరుగుతున్న వివాదం పై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో హిందువుల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం తమిళనాడులో హిందువులు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. హిందువులు 'హిందూ' అనే పదాన్నే మర్చిపోతున్నారు. మతపరమైన ఆచారాలను పాటించడంలో కూడా వివక్ష ఎదురవుతోంది" అని శరత్ కుమార్ మండిపడ్డారు. మదురై దీపం వివాదం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.
అలాగే రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలపై శరత్ కుమార్ తన ప్రణాళికను స్పష్టం చేశారు. "2026 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేయనని, క్షేత్రస్థాయిలో ఉండి బీజేపీ కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యం" అని ప్రకటించారు. ఇదే సమయంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ (TVK చీఫ్) గురించి మాట్లాడుతూ.. "నేను విజయ్‌ను ఒక రాజకీయ నాయకుడిగా చూడటం లేదు. రాజకీయాల్లో ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో కూడా ఆయనకు ఇంకా తెలియదు" అని వ్యాఖ్యానించారు. శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు డీఎంకే వర్గాల్లో, ఇటు విజయ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. 2026 ఎన్నికలకు ముందే తమిళనాడులో సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.






