పోలండ్ మహిళ రేప్.. ముంబయి వ్యక్తిపై కేసు

by Sathputhe Rajesh |

విదేశీ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలండ్ మహిళ రేప్.. ముంబయి వ్యక్తిపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలండ్‌కు చెందిన మహిళపై 2016 నుంచి 2022 వరకు పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబోలీ ప్రాంతానికి చెందిన మనీష్ గాంధీ బాధితురాలి అభ్యంతరక ఫోటోలు తీసి వాటిని బయటపెడతానని బెదిరించి సదరు మహిళపై అత్యాచారం చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story