- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TVK: టీవీకే విజయ్ కు పోలీసుల షాక్
తొక్కిసలాట జరుగుతుందనే కారణంతో పోలీసులు టీవీకే రోడ్ షో కు పోలీసులు అనుమతి నిరాకరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ రోడ్ షోకు పోలీలుసు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఈ కార్నర్ మీటింగ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫంక్షన్ హాల్‍లో మీటింగ్‍కూ సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మాజీ మంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్ ఇటీవల విజయ్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈయన స్వస్థలం ఈరోడ్ కావడంతో అక్కడ విజయ్ చేత ఈ నెల 16వ తేదీన ర్యాలీ నిర్వహించాలని సెంగట్టయన్ భావించారు. ఈ మేరకు ఇవాళ ఆయన అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశారు. ఈ మేరకు ఈరోడ్-పెరుండురై రోడ్డులోని పవలతంపాలయం ప్రాంతంలోని ఏడు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అక్కడ టీవీకే సమావేశం నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే సభకు, వాహనాల పార్కింగ్ ఈ స్థలం సరిపోదంటూ పోలీసులు విజయ్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ టీవీకే పిటిషన్‌లో 70 వేల మంది జనసమూహం ఉంటుందని పేర్కొన్నారని అందమందికి వారు ప్రతిపాదించిన స్థలం సరిపోదనే కారణంతోనే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. జనసమూహానికి, వాహనాల పార్కింగ్ కు స్థలం సరిపోదని ఈ నిర్ణయాన్ని సెంగొట్టయన్‌కు తెలియజేస్తూ వేరే స్థలాన్ని ఎంచుకోవాలని చెప్పామన్నారు. కాగా గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నాయకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో విజయ్ సభల విషయంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.






