250 మద్యం సీసాలు..కుర్చీల్లో పెట్టుకుని స్మ‌గ్లింగ్‌, ప్లాన్ అదుర్స్

by velandi.Saikiran |

సినిమా రేంజ్ లో మ‌ద్యం స‌ప్లై చేస్తోన్న ఈ సంఘ‌ట‌న‌ బీహార్ లో ముజాఫర్ పూర్ లో చోటుచేసుకుంది.

250 మద్యం సీసాలు..కుర్చీల్లో పెట్టుకుని స్మ‌గ్లింగ్‌, ప్లాన్ అదుర్స్
X

దిశ, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి లిక్కర్ బాటిళ్లు దొంగతనంగా సప్లై చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చాలా రోజుల నుంచి ఇలా సప్లై చేస్తున్న ఆ వ్యక్తి, తాజాగా పోలీసుల‌కు దొరికిపోయాడు. సినిమా రేంజ్ లో మ‌ద్యం స‌ప్లై చేస్తోన్న ఈ సంఘ‌ట‌న‌ బీహార్ లో ముజాఫర్ పూర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సినిమా రేంజ్ లో మ‌ద్యం సప్లై

బీహార్ లోని ముజాఫర్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుర్చీలు విక్రయిస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే కుర్చీలతో పాటు సైడ్ గా లిక్కర్ బాటిళ్లను స‌ప్లై చేసేవాడు. కుర్చీల మధ్యలో లిక్కర్ బాటిళ్ల‌ను పెట్టి, చాలా రోజుల నుంచి దొంగ చాటున స్మ‌గ్లింగ్‌ చేస్తున్నాడు. కానీ తాజాగా ముజాఫర్ పూర్ జిల్లాలోని కుర్హానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతని వాలకం కాస్త తేడాగా ఉండడంతో కుర్చీలు మొత్తం విప్పి చూశారు. అందులో దాదాపు 250 క్వార్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. పుష్ప సినిమాను మించిపోయోలా ఉంది అంటు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story