- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు ఇప్పటికైనా వాక్ స్వాతంత్రాన్ని అర్థం చేసుకోవాలి
ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు సున్నితత్వాన్ని చూపించి ఉండాల్సిందని ధర్మాసనం సూచించింది.

- సృజనాత్మకత పట్ల ఎవరికీ గౌరవం లేదు
- ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు భావ ప్రకటనను గుర్తించాలి
- కాంగ్రెస్ ఎంపీ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్లు గడిచింది. పోలీసులు ఇప్పటికైనా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు చురకలంటించింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తనపై నమోదైన ఎఫ్‌ఐర్ఆర్‌ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తన సోషల్ మీడియా ఖాతాలో 'ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో..' అనే కవితకు సంబంధించిన వీడియో క్లిప్ పోస్ట్ చేశారని.. దీని వల్ల మత సామరస్యం దెబ్బతిన్నదనే ఆరోపణలతో కేసు నమోదు చేవారు. అయితే ఈ కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూటాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కవిత వాస్తవానికి అహింసా సందేశాన్ని ప్రచారం చేస్తోందని తెలిపింది. దీనికి ఏ మతంతో కానీ, ఏ దేశ వ్యతిరేక కార్యకలాపాలతో కానీ సంబంధం లేదని చెప్పింది.
ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు సున్నితత్వాన్ని చూపించి ఉండాల్సిందని ధర్మాసనం సూచించింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే... ఎవరికీ సృజనాత్మకత పట్ల గౌరవం లేదు. ఈ కవితను మీరు స్పష్టంగా చదవి ఉంటే మీకు అర్థమయ్యేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సోషల్ మీడియా చాలా ప్రమాదకరమైన సాధనమని, ప్రజలు దీని పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
కాగా, వివాదాస్పదమైన కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గుజరాత్ పోలీసులు ఇమ్రాన్ ప్రతాప్‌గఢిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. డిసెంబర్ 29న ప్రతాప్‌గఢి తన 'ఎక్స్' హ్యాండిల్‌లో 46 సెకెన్ల నిడివి ఉన్న కవిత వీడియోను పోస్టు చేశారు. కాగా, జనవరి 3న జామ్ నగర్ పోలీసులు మతం,జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని, జాతీయ సమైఖ్యతకు భంగం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని, మతపరమైన సమూహాన్ని, వారి నమ్మకాలను అవమానిస్తున్నాడని కేసు నమోదు చేశారు. జనవరి 17న తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని.. తాను ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసే కవితనే పోస్టు చేశానని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను కొట్టేయడానికి నిరాకరించింది.






