- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్డిక్ పాండ్యా మీద పోలీస్ కంప్లైంట్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నారు. టీ20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ ఒక న్యాయవాది మహారాష్ట్రలోని పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆట పరంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్ మొత్తం మీద ఆయన టోర్నమెంట్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు అర్ధశతకాలు కూడా చేశారు. లీగ్ దశలో నమీబియాపై జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించారు. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా హార్దిక్ తనదైన పాత్ర పోషించారు. ఇక ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక మొత్తంగా మూడు సార్లు ఈ టైటిల్‌ను గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.






