- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ నిరసనలపై పోలీసుల అరాచకం.. ఉన్నత స్థాయి కమిటీ విచారణకు సుప్రీంకోర్టు సంకేతాలు
నీట్ నిరసనలపై పోలీసుల బలప్రయోగం, దాడులపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు సుప్రీంకోర్టు సంకేతాలు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు, నిరసనలు సహజమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనల్లో విద్యార్థులు, మహిళలు, లాయర్లు, విలేకరులపై పోలీసుల దాడి, తీవ్ర గాయాలపైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
"ఈ తీవ్రమైన ఆరోపణలపై స్వతంత్ర విచారణ ఎందుకు జరిపించకూడదు?" అని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ఒక ఉన్నత స్థాయి (హై పవర్డ్) కమిటీని ఏర్పాటు చేయాలని సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో నిరసనలు, పోలీసు చర్యలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రోటోకాల్ నిబంధనలు తెచ్చేందుకు కోర్టు కసరత్తు చేస్తోంది. ఈ యూనిఫాం ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన తర్వాత చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా, హద్దులు దాటి దౌర్జన్యాలకు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.






