- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
POK: పీఓకేపైనే పాక్‌తో తదుపరి చర్చలుండాలి.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ
పాకిస్థాన్‌తో తదుపరి చర్చలు పూర్తిగా పీఓకే అంశంపైనే కేంద్రీకృతమై ఉండాలని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌తో తదుపరి చర్చలు పూర్తిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంశంపైనే కేంద్రీకృతమై ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishake benarjee) అన్నారు. ఈ ఒక్క అంశంలో మాత్రమే దాయాదితో డిస్కస్ చేయాలని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందని, ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో భాగమైన అభిషేక్ బెనర్జీ మలేషియాలోని కౌలాలంపూర్‌లో ప్రవాస భారతీయులతో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అధికార పార్టీతో తనకు విభేదాలున్నప్పటికీ జాతీయ భద్రత, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వంతో కలిసి నిలబడతామని స్పష్టం చేశారు.
ప్రవాస భారతీయులంతా కశ్మీర్ ను సందర్శించి దాని పర్యాటక అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు. హింస ద్వారా కశ్మీర్‌ను అస్థిరపరచాలని కుట్రలు చేస్తున్న వారికి ఈ ప్రాంత శ్రేయస్సును బలోపేతం చేయడమే ఉత్తమ సమాధానమని నొక్కి చెప్పారు. దేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తే మూడు నాలుగు రోజులు కశ్మీర్ లోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. డయాస్పోరాలో జరిగిన సమావేశంలో మలేషియా భారతీయ ముస్లింలతో సహా భారతీయ సమాజ సభ్యులు ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై ఇండియా చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.






