స్కూల్‌ తాగునీరులో విషం.. 41 మంది పిల్లలకు తీవ్ర అస్వస్థత

by Kema Shiva Kumar |

కర్ణాటకలో దారుణానికి ఒడిగట్టారు శ్రీ రామ సేనా సభ్యులు.

స్కూల్‌ తాగునీరులో విషం.. 41 మంది పిల్లలకు తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో దారుణానికి ఒడిగట్టారు శ్రీ రామ సేనా సభ్యులు. బెళగావి ప్రాథమిక పాఠశాల తాగునీటి ట్యాంక్‌లో విషం కలిపారు. ఈ ఘటనలో హెడ్‌ మాస్టర్‌ను ఇరికించాలని ప్రయత్నం చేశారు. కానీ అసలు నిజం బయటపటంతో జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే బెళగావి శ్రీ రామ సేనా అధ్యక్షుడు సాగర్ పాటిల్ మరో ముగ్గురు(కృష్ణ మాదవ్, నగనగౌడ, హులి కట్టి)తో కలిసి ఈ ప్లాన్ వేశాడు. ముఖ్యంగా ముస్లిం మతానికి చెందిన హెడ్ మాస్టర్ సులేమాన్‌ను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించడమే లేక సస్పెండ్ చేయించడమో.. ఇందులో ఏదో ఒకటి జరగాలనేది వారి టార్గెట్.

ఈ క్రమంలో సాగర్ పాటిల్ ఈ ప్లాన్‌ను కృష్ణతో అమలు పరిచాడు. కృష్ణ ఓ విద్యార్థికి చాక్లెట్, చిప్స్, ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆశ చూపి.. పురుగుల మందును ట్యాంక్‌లో కలపమన్నాడు. అక్కడి వరకు అలాగే జరిగింది. కానీ ఈ నీరు తాగిన విద్యార్థులకు వాసన రావడంతో అనుమానం మొదలైంది. కానీ అప్పటికే నీరు తాగిన 40 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో కోలుకున్నారు. ఇక నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య హీనమైన చర్యగా పేర్కొన్నారు. మతపరమైన ద్వేషం సామాజిక సామరస్యానికి ముప్పు కలిగిస్తుందని.. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story