- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారితో అసభ్య ప్రవర్తన! స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుపై పోక్సో కేసు
షాహాపూర్ తాలూకా మహలరోజా గ్రామానికి చెందిన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు మల్లికార్జున్ ముత్యా, ఒక ఏడేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అభ్యంతరకర వీడియో ప్రస్తుతం కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. షాహాపూర్ తాలూకా మహలరోజా గ్రామానికి చెందిన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు మల్లికార్జున్ ముత్యా, ఒక ఏడేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం మల్లికార్జున్ ముత్యా ఒక చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అసభ్యంగా ముద్దు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శశిధర్ కుసుంబె సుమోటోగా స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఫిర్యాదు మేరకు గోగి పోలీసులు గురువారం మల్లికార్జున్ ముత్యాపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75తో పాటు పోక్సో చట్టంలోని వివిధ నిబంధనల కింద (Crime No. 25/2026) ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆరోపణలను తోసిపుచ్చిన ముత్యా..
ఈ ఘటనపై మల్లికార్జున్ ముత్యా స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. ‘నేను ఆ బాలికను తండ్రిలా భావించి వాత్సల్యంతోనే దగ్గరకు తీసుకున్నాను. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. చట్టపరమైన విచారణకు పూర్తిగా సహకరిస్తాను’ అని ఆయన ఒక వీడియో సందేశంలో తెలిపారు.
తల్లిదండ్రుల వింత వాదన..
ఈ కేసులో మరో విచారకరమైన విషయం ఏమిటంటే, సదరు బాలిక తల్లిదండ్రులు బాబాకు మద్దతుగా మాట్లాడారు. ఇన్ స్టాగ్రామ్‌లో కేవలం 'లైకుల' కోసమే తాము ఆ వీడియోను షూట్ చేసి అప్‌లోడ్ చేశామని, బాబాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముత్యా అనుచరులు బాబాకు సపోర్ట్‌గా క్యాంపెయిన్ మొదలుపెట్టగా, పోలీసులు మాత్రం వీడియో ఆధారంగా లోతైన విచారణ జరుపుతున్నారు.






