- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ‘ఛీ.. చిన్న పిల్లని కూడా వదిలిపెట్టరా..?’ చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి లైంగిక వేధింపులు
‘ఛీ.. చిన్న పిల్లని కూడా వదిలిపెట్టరా..?’ చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి లైంగిక వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లో ఓ 70 ఏళ్ల వృద్ధుడు తన దుకాణానికి వచ్చిన ఓ చిన్నారిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రతి రోజూ ఏదో ఓ మూలన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందులోనూ కొంతమంది ఉన్మాదులు అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో వెలుగుచూసింది. మహ్మద్ అన్వర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు తన దుకాణానికి సరుకుల కోసం వచ్చిన ఓ చిన్నారిని లైంగికంగా వేధించసాగాడు. అదే సమయంలో మరో బాలుడు అక్కడకు రావడంతో ఆమెని వదిలిపెట్టేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను దూరం నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో యూపీ పోలీసులు వెంటనే నిందితుడిపై పోస్కో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఛీ.. చిన్న పిల్లని కూడా వదిలిపెట్టరా..?’’ అంటూ నిందితుడిపై మండిపడుతున్నారు.
Next Story






