- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి మాటలను మానుకోండి
చైనాతో బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్‌లాక్‌గా ఉంటాయని.. కాబట్టి ఇది తమకు అడ్వాంటేజ్ అని ఇటీవల యూనస్ వ్యాఖ్యానించారు.

- శాంతియుత బంగ్లాకు భారత్ మద్దతు
- సరిహద్దుల్లో కఠినంగా ఉంటాం
- బంగ్లా సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో భారత్
దిశ, నేషనలో బ్యూరో: స్థిరమైనా, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల సంబంధానికి ప్రజా కేంద్రీకృత విధానాన్ని విశ్వసిస్తున్నామని, రెండు దేశాలు సుదీర్ఘకాలం పాటు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఇండియా తన ఆందోళనలను బంగ్లాదేశ్ నాయకుడి వద్ద లేవనెత్తారు. ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగింది. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండియా పదునుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మాటలను, వాక్చాతుర్యాన్ని మానుకోవాలని పీఎం మోడీ ఆయనకు హితకు పలికారు.
చైనాతో బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని, ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్‌లాక్‌గా ఉంటాయని.. కాబట్టి ఇది తమకు అడ్వాంటేజ్ అని ఇటీవల యూనస్ వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దు స్థిరత్వం, భద్రతను కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి భారత్ కఠినంగా ఉందని.. రాత్రి సమయంలో సరిహద్దు దాటే వారిని నిరోధించడానికి సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ ప్రతినిధి మిస్రి అన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల సహా మైనార్టీల భద్రతకు సంబంధించిన ఆందోళనను ప్రధాని మోడీ నొక్కి చెప్పినట్లు మిస్రీ అన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం యూనస్‌ను ప్రధాని మోడీ ఒత్తిడి చేసినట్లు మిస్రి పేర్కొన్నారు. మరోవైపు బంగ్లా ప్రభుత్వం కూడా మోడీ, యూనస్ మధ్య జరిగిన సమావేశంపై ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో తమ సంబంధాన్ని ఎంతో విలువైనదిగా పేర్కొంది. రెండు దేశాల మధ్య లోతైన స్నేహం ఉంది. ఇరుదేశాల చరిత్ర ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు చెప్పారు.






