- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Modi: ప్రధాని మోడీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 12, 13న అమెరికాలో పర్యటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 12, 13న అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 12 సాయంత్రం వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోడీ.. 13న తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అవుతారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ పర్యటనపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పందించారు. "ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించే అతి కొద్దిమంది ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోడీ ఒకరు. బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోపు అమెరికాను సందర్శించడానికి ప్రధానమంత్రిని ఆహ్వానించడం.. భారతదేశం-యూఎస్ భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది." అని మిస్రి అన్నారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటనలో మరో ప్రధాన దృష్టి వలస సమస్యలపై ఉంటుంది, ఎందుకంటే ఇది 104 మంది అక్రమ భారతీయులను సైనిక విమానంలో అమెరికా బహిష్కరించిన నేపథ్యంలో వస్తుంది.
ఫ్రాన్స్ పర్యటన
మోడీ అమెరికా పర్యటనకు ముందు ఈ నెల 10నుంచి 12 వరకు మోడీ ఫ్రాన్స్ (France)లో పర్యటించనున్నారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోడీ(PM Modi) ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలించనున్నారని మిస్రీ తెలిపారు.






