- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ఈ సొరంగం ప్రాజెక్ట్ కశ్మీర్ లోయలో రాకపోకలను అత్యంత కీలకం.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం(జనవరి 13న) జమ్మూకశ్మీర్‌లోని జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. గందర్‌బల్ జిల్లాలో ఉన్న ఈ టన్నెల్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఈ సొరంగం ప్రాజెక్ట్ కశ్మీర్ లోయలో రాకపోకలను అత్యంత కీలకం. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఒకరోజు ముందే కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరిచారు, పలు జిల్లాల్లోని ముఖ్యమైన కూడళ్లలో డజన్ల కొద్దీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ జరుగుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలతో సహా ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్టు అధికారులు వెల్లడించారు. డ్రోన్‌లతో సహా వైమానిక, సాంకేతిక నిఘా ఉండనుంది. అలాగే, అధికారులు శనివారం నుంచి సోమవారం వరకు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. జెడ్-మోర్ సొరంగం సమీపంలో ఎస్పీజీ సిబ్బంది కార్యక్రమ వేదికను పూర్తిస్థాయిలో తమ అధీనంలోకి తీసుకున్నారని అధికారులు వివరించారు. గగాందీర్ వద్ద ప్రధాని మోడీ బహిరంగ ర్యాలీలో ప్రసంగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 20న గగాంగీర్ ప్రాంతంలోని సొరంగం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్థానిక వైద్యుడితో సహా ఏదుగురు మరణించిన సంగతి తెలిసిందే.






