రష్యాతో ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.. మోడీ

by Disha Web Desk 16 |
రష్యాతో ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.. మోడీ
X

న్యూఢిల్లీ: రష్యాతో ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆసక్తిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ముఖ్యంగా శక్తి, కోకింగ్ కోల్ రంగాల్లో ఇది చాలా అవసరమని చెప్పారు. రష్యాలోని వ్లాదివొస్తొక్ నగరంలో నిర్వహిస్తున్న 7వ ఈస్టర్న్ ఎకానమిక్ సదస్సులో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపాయని అన్నారు. ముందు నుంచి యుద్ధం విషయంలో భారత్ చర్చలకే ప్రాధాన్యతను ఇచ్చిందని పునరుద్ఘాటించారు. 'నేటి ప్రపంచీకరణలో ప్రపంచంలోని ఒక భాగంలో జరిగే సంఘటనలు మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతాయి. ఉక్రెయిన్ వివాదం, కోవిడ్ మహమ్మారి ప్రపంచ సరఫరా గొలుసులపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపాయి. ఆహారధాన్యాలు, ఎరువులు, ఇంధన కొరత అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ఆందోళన కలిగించే విషయం' అని అన్నారు.

యుద్ధాన్ని ఆపేందుకు శాంతిపూర్వక ప్రయత్నాలకే తాము మద్దతిచ్చామని చెప్పారు. ఈ నెలతోనే వ్లాడివోస్తాక్‌లో భారత కాన్సులేట్‌ను స్థాపించి 30 ఏళ్లు పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ నగరంలో కాన్సులేట్ ను ప్రారంభించని మొదటి దేశం భారత్ అని పేర్కొన్నారు. 2019లో నేరుగా ఈ సదస్సులో పాల్గొనే అవకాశం భారత్ కు వచ్చిందని గుర్తుచేశారు. ఆ సమయంలో 'యాక్ట్ ఫార్ ఈస్ట్' భారత పాలసీని ప్రకటించామని తెలిపారు. దీని ఫలితంగానే రష్యాకు భారత్ సహకారం పలు రంగాల్లో పెరిగిందని పేర్కొన్నారు. ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ సదస్సు గురువారం వరకు రష్యా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 'ఆన్ ది పాత్ టు ఎ మల్టీపోలార్ వరల్డ్' అనే థీమ్‌తో, ఆర్థిక, పెట్టుబడి, పర్యాటక అవకాశాలను ప్రదర్శించే "ది ఫార్ ఈస్ట్ స్ట్రీట్" ఎగ్జిబిషన్ వంటి కీలక ఈవెంట్‌లు జరుగుతున్నాయి.

Also Read : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి

కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనే.. ఎంపీ ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

UK కొత్త హోం సెక్రటరీగా గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్

Next Story

Most Viewed