- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: వాతావరణం అనుకూలంగా ఉంది.. మోడీ పర్యటనపై ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్(Jammu and Kadhmir) లోని గాందేర్బల్ జిల్లాలో నిర్మించిన వ్యూహాత్మక జెడ్- మోడ్(Z Morh tunnel) సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్(Jammu and Kadhmir) లోని గాందేర్బల్ జిల్లాలో నిర్మించిన వ్యూహాత్మక జెడ్- మోడ్(Z Morh tunnel) సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా జెడ్ -మోడ్ టన్నెల్ ని ప్రారంభించడమే కాకుండా దాని లోపలికి వెళ్లి పరిశీలించారు. ప్రధాని సొరంగంలోకి వెళ్లి ప్రాజెక్టు అధికారులతో సంభాషించారు. సొరంగం పూర్తి చేయడానికి కఠినమైన పరిస్థితుల మధ్య జాగ్రత్తగా పనిచేసిన నిర్మాణ కార్మికులతో కూడా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ (Jammu and Kadhmir) లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఒమర్
సొరంగం ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోడీకి జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. తీవ్రమైన చలిలో వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు."యోగా దినోత్సవ కార్యక్రమంలో మీరు (ప్రధాని మోడీ) ఇచ్చిన వాగ్దానాన్ని త్వరలో నెరవేరుస్తారని మేం ఆశిస్తున్నాం. జమ్ముకశ్మీర్ త్వరలో దేశంలో ఒక రాష్ట్రంగా తన స్థానాన్ని పొందుతుంది. ఈ సంతోషకరమైన సందర్భంగా మీరు ఈ తీవ్రమైన చలిలో ఇక్కడికి వచ్చి ఈ సొరంగంను ప్రారంభించినందుకు ధన్యవాదాలు" అని అబ్దుల్లా అన్నారు. "వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఒక్క మేఘం కూడా లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. మా హృదయాల్లోనూ ఆత్మీయత ఉంది. మీరు జమ్ముకశ్మీర్‌కు ఎప్పుడూ ఇలానే వస్తుంటారని.. మా ఆనందంలో పాల్గొంటారని భావిస్తున్నాం" అని ఆయన జోడించారు.
రూ.2,700 కోట్లతో నిర్మాణం
శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో దీన్ని నిర్మించారు. కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నెల్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లఢఖ్ కు రోడ్డుద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్‌మార్గ్‌కు పర్యటకుల తాకిడి కూడా పెరగనుంది.






