PM Narendra Modi: ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA), ప్రతిపక్ష ఇండి కూటమిల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ( Waqf (Amendment) Bill-2025)కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

PM Narendra Modi: ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA), ప్రతిపక్ష ఇండి కూటమిల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 (Waqf (Amendment) Bill-2025)కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బిల్లుపై లోక్‌సభ (Lok Sabha) ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 288, ప్రతికూలంగా 232 ఓట్ల రావడం బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్యసభ (Rajya Sabha)లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపినట్లు అయింది. అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025నును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమోదం కోసం పంపనున్నారు. ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా రూపాంతరం చెందనుంది.

ఈ క్రమంలోనే వక్ప్ బిల్లు ఆమోదంపై ప్రధాన నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని కామెంట్ చేశారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లుతో అట్టడుగునే మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Next Story