మణిపూర్‌లో పర్యటించనున్న మోడీ?

by Phanindra |

మణిపూర్‌లో త్వరలోనే మోడీ పర్యటించనున్నారని సమాచారం. సెప్టెంబరు 12 నుంచి 14 మధ్య ఆయన పర్యటన జరగనుందట.

మణిపూర్‌లో పర్యటించనున్న మోడీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతి విద్వేష గొడవలతో అట్టుడికిన మణిపూర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నట్లు సమాచారం. సెప్టెంబరు 12-14 మధ్య ఈ రాష్ట్రానికి మోడీ వెళ్తారని తెలుస్తోంది. 2023లో మణిపూర్‌లో మొదలైన జాతి విద్వేష దాడులు హద్దుమీరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్‌కు ప్రధాని ఎందుకు వెళ్లడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్ని నెలల్లో మణిపూర్‌లో భద్రతను బలోపేతం చేయగా.. హింసాత్మక ఘటనలు కూడా పెద్దగా నమోదు కాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లో మోడీ పర్యటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హింస కారణంగా తమ ఇళ్లు వదిలి తరలిపోయిన వారిని మోడీ కలిసి, పరామర్శిస్తారని తెలుస్తోంది.

Next Story