బిహార్‌లో 4 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించిన మోడీ

by Phanindra |   (  Updated:2025-07-19 16:59:25  IST  )

బిహార్‌లో 4 అమృత్ భారత్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. దీంతో ఈ రాష్ట్రంలోని అమృత్ భారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరింది.

బిహార్‌లో 4 అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో రైల్ కనెక్టివిటీని ఈ రైళ్లు మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. ఈ రైళ్లు మొత్తం నాలుగు మార్గాల్లో సేవలందించనున్నాయి. అవేంటంటే.. రాజేంద్ర నగర్ టర్మినల్ (పట్నా) నుంచి న్యూఢిల్లీ, బాపుధామ్ మోతిహరి నుంచి ఢిల్లీ (ఆనంద్ విహార్ టర్మినల్), దర్భంగా నుంచి లక్నో (గోమతీ నగర్), మాల్దా టౌన్ నుంచి లక్నో (గోమతీ నగర్). ఈ మార్గాల్లో కొత్త అమృత్ భారత్ రైళ్లు సేవలందిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. దీంతో బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభించే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే దేశంలో అత్యధిక అమృత్ భారత్ రైళ్లు మొదలయ్యే రాష్ట్రంగా బిహార్ నిలిచింది.

Next Story