భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-24 11:04:19  IST  )

బాలీవుడ్ సీనియర్ నటుడు, హీమ్యాన్ ధర్మేంద్ర (89) మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.

భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ నటుడు, హీమ్యాన్ ధర్మేంద్ర (89) మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసిందన్నారు. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తీసుకొచ్చారని, ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఆకర్షణ, లోతును తీసుకొచ్చిన అద్భుతమైన నటుడని కొనియాడారు. విభిన్న పాత్రలను పోషించిన ఆయన.. లెక్కలేనంతమంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు. అలాంటి ధర్మేంద్ర లేకపోవడం ఎంతో విచారకరమైన విషయమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

పవన్ కల్యాణ్ సంతాపం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ధర్మేంద్ర మృతిపట్ల సంతాపం తెలిపారు. ధర్మేంద్ర మరణవార్త తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తు్నట్లు పేర్కొన్నారు.

Read More... ధర్మేంద్ర మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఎక్స్‌లో ఎమోషనల్ ట్వీట్

ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్

Next Story