ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌరపురస్కారం

by Phanindra |

ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌరపురస్కారం అందించారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి విదేశీ నేత మోడీనే కావడం గమనార్హం.

ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌరపురస్కారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో సత్కరించింది. ఒక విదేశీ నేతకు ఈ అవార్డు అందించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల తరఫున దీన్ని అందుకుంటున్నా’ అని చెప్పారు. కాగా, 1999 తర్వాత ఈ కరీబియన్ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ప్రధాని మోడీ ఈ దేశానికి వచ్చారు. ఆయనకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సద్ బిసెస్సర్ ఘనస్వాగతం పలికారు.

Next Story