- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో ప్రధాని మోడీ చర్చలు.. పశ్చిమ ఆసియా సంక్షోభం పై ఆందోళన
సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో ప్రధాని మోదీ చర్చలు. పశ్చిమ ఆసియా సంక్షోభం, షిప్పింగ్ మార్గాల భద్రతపై ఆందోళన. భారతీయ సమాజం సంక్షేమంపై కృతజ్ఞతలు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాల పై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంధన భద్రతకు విఘాతం కలిగించే చర్యలు ఆందోళనకరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాలని, నావిగేషన్ స్వేచ్ఛను నిర్ధారించవలసిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ సమాజం సంక్షేమం కోసం నిరంతరం మద్దతు ఇస్తున్న క్రౌన్ ప్రిన్స్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాంతీయ శాంతి, భద్రతలను కాపాడటంలో భారత్-సౌదీల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధం కీలకమని ఈ చర్చల ద్వారా మరోసారి స్పష్టమైందని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.






