- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌కు మరో BIG షాక్.. కట్టలు తెంచుకున్న ప్రధాని మోడీ కోపం
పాకిస్తాన్(Pakistan)కు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. పాక్‌కు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్శల్స్, మెయిల్స్‌పై నిషేధం విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan)కు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. పాక్‌కు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్శల్స్, మెయిల్స్‌పై నిషేధం విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన వెబ్‌సైట్లను కూడా బ్యాన్ చేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నది. అంతకుముందు పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ(PM Modi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారికి మద్దతిచ్చిన వారిని కూడా అంతం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో కలిసి ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని మోడీ అన్నారు. పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలిందని చెప్పారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన వారని.. వారిలో ఒకరు పాక్ ఆర్మీ(Pakistan Army)లో పారా కమాండోగా పనిచేసినట్లు తేలిందని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఎవరినీ వదలిపెట్టబోమని సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే, తాజాగా భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మరోసారి ఉగ్రవాదులకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.






