- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Modi: కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలా పనిచేయాలి- మోడీ
ఫ్యూచర్ సిటీల కోసం రాష్ట్రాలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్యూచర్ సిటీల కోసం రాష్ట్రాలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం కృషి చేయాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అభివృద్ధి వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రులను కోరారు. దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న మోడీ.. “వన్ స్టేట్- వన్ గ్లోబల్ డెస్టినేషన్” (ఒక రాష్ట్రం- ఒక ప్రపంచ గమ్యస్థానం) అనే ఆలోచనను ముందుకు తెచ్చారు. మోడీ మాట్లాడుతూ.. "రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా.. అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించాలన్నారు. దీంతో, ప్రతి రాష్ట్రానికి కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేయాలి. వన్ స్టేట్ – వన్ గ్లోబల్ డెస్టినేషన్ కోసం కృషి చేయాలి. దీని వల్ల పొరుగున ఉన్న నగరాలను కూడా పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి వీలవుతుంది" అని ఆయన అన్నారు.
టీమిండియాగా పనిచేయాలి
'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం, రాష్ట్రాలు "టీమ్ ఇండియా"గా కలిసి పనిచేయాలని కూడా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలని.. టీమిండియాలా కలిసి పనిచ్సేత.. ఏ లక్ష్యం అసాధ్యం కాదన్నారు. ఫ్యూచర్ సిటీల అభివృద్ధికి "వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం" (గ్రోత్, ఇన్నోవేషన్, సస్టెనబులిటీ)మంత్రంగా ఉండాలన్నారు. "భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. ఫ్యూటర్ సిటీ కోసం కృషి చేయాలి. ప్రతి రాష్ట్రాన్ని, నగరాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉండాలి. ఈ మార్గాల్లో పనిచేస్తే వికసిత్ భారత్‌గా మారడానికి 2047 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు. అంతేకాకుండా, శ్రామిక శక్తిలో మహిళలను చేర్చుకోవాలన్నారు. అందుకోసం, చట్టాలు, విధానాలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశానికి దక్షిణాది ముఖ్యమంత్రులు పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులతో మోడీ నిర్వహించిన మొదటి సమావేశం ఇదే.






