- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తాం: ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) శుక్రవారం బిహార్‌లో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. బిహార్‌లోని సమస్తీపూర్(Samastipur)లో మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఆరు చోరీ కేసులలో బెయిల్‌పై ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా బిహార్‌లో గత రికార్డులను ఎన్డీఏ కూటమి బ్రేక్ చేస్తుందని జోస్యం చెప్పారు. కర్పూరీ ఠాకూర్ స్పూర్తితో సుపరిపాలనను సంపదగా బిహార్‌ను మారుస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. అంతకుముందు బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు జరుగుతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్..తన కూటమి భాగస్వామ్య పార్టీలను అంతం చేసే పరాన్నజీవి అని అన్నారు. వలసలు అరికడతామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీలు వింటుంటే.. గతంలో ఆర్జేడీ ప్రమేయం ఉన్న ల్యాండ్ఫర్ జాబ్ స్కామ్ గుర్తొస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఆర్జేడీ.. ఆ ఉద్యోగులకు చెల్లించేందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయో చెప్పాలన్నారు. గ్యాంగ్‌స్టర్లకు ఆ పార్టీ టికెట్లు ఇస్తున్నదని, ఇది బిహార్ భద్రతకే ప్రమాదమన్నారు.






