- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ డిన్నర్ పార్టీ..
ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ డిన్నర్ పార్టీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఎన్డీయే ఎంపీలు విందుకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ డిన్నర్ పార్టీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఎన్డీయే ఎంపీలు విందుకు హాజరయ్యారు. విందు కార్యక్రమానికి 50కి పైగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కేంద్ర మంత్రి కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాట్లు చూసుకున్నారు. ఎంపీలు 20 నుంచి 25 మంది బృందాలుగా బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే సొంత కార్లలో పార్లమెంట్ నుంచి నేరుగా డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం సైతం ఇచ్చారు.
ఎంపీలను రాష్ట్రాల వారీగా గ్రూపులుగా విభజించారు. ప్రధాని నరేంద్ర మోడీ అందరు ఎంపీలతో సంభాషించనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించే అవకాశం ఉంది. కాగా, ఈ విందును గత పార్లమెంట్ సమావేశాల సమయంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా విందును వాయిదా వేశారు. బీహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధించిన తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది.






