ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ రోజు జరిగిన మొదటి కాల్పుల విరమణ ఒప్పందం కీలకంగా మారింది.

ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య ఈ రోజు జరిగిన మొదటి కాల్పుల విరమణ (First ceasefire) ఒప్పందం కీలకంగా మారింది. ప్రపంచానికి శాంతి దిశగా ఒక కొత్త దృక్కోణాన్ని అందించేలా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన తాజా శాంతి ఒప్పందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.." ఈ ఒప్పందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక యొక్క మొదటి దశను ప్రతిబింబిస్తున్నది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) బలమైన నాయకత్వానికి కూడా సాక్ష్యం. శాంతి ప్రణాళికల్లో భాగంగా.. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందించడం, వారికి తాత్కాలిక విశ్రాంతిని అందించడమే కాక, శాశ్వత శాంతి సాధనకు దారి సుగమం చేస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రాంతీయ స్థాయిలో, అంతర్జాతీయంగా శాంతిని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story