మాట జాగ్రత్త.. ఎన్డీయే నేతలకు మోడీ వార్నింగ్

by Phanindra |

ఎన్డీయే నేతల మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో నేతలు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని మోడీ చెప్పారట.

మాట జాగ్రత్త.. ఎన్డీయే నేతలకు మోడీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీయే కూటమి నేతలు పబ్లిక్‌గా మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ హెచ్చరించారట. ఢిల్లీలో ఆదివారం నాడు ఎన్డీయే లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనవసర వ్యాఖ్యలు చేయకూడదని, తమ వ్యాఖ్యలు హద్దు మీరకుండా చూసుకోవాలని మోడీ సూచించినట్లు సమాచారం.


అలాగే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణలో మరో దేశం జోక్యం లేదని, పాకిస్తాన్ డీజీఎంవో అభ్యర్థన మేరకే ఒప్పందం చేసుకున్నామని తమ కూటమి నేతలకు మోడీ స్పష్టం చేశారట. కొన్ని రోజుల క్రితం ఆపరేషన్ సిందూర్, మిలటరీపై కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే మరో నేత ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మాట్లాడుతూ త్రివిధ దళాలు మోడీ కాళ్లు మొక్కాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story